ATP: సోమందేపల్లి మండలంలోని మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం తహశీల్దార్ రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. పంచాయతీలోని ప్రజలు గ్రామసభ ద్వారా తమ సమస్యలపై అర్జీలు ఇచ్చి సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రైతులు గ్రామసభ ద్వారా రెవిన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.