MDK: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకని అన్నారు.