KMR: పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శుక్రవారం పశువులకు పశువైద్యాధికారి డా. మణి కుమార్ సిబ్బందితో కలిసి గాలికుంటు నివారణ టీకాలు వేశారు. జిల్లా పశు వైద్యాధికారి సూచనల మేరకు కాటేపల్లిలో 226 ఆవులకు,167 గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్, చాంద్ పాషా, సురేశ్, గోపాలమిత్ర ఉన్నారు.