TG: ఖమ్మం జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన హిందీ పండిట్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది. 24 రోజులు డ్యూటీ చేశాక తొలగించారని హిందీ పండిట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్క్రూటినీలో అధికారుల నిర్లక్ష్యంతో తప్పు జరిగిందని ఖమ్మం డీఈవో తెలిపారు. అర్హులకు అన్యాయం జరగొద్దనే వీళ్లను తొలగించామని చెప్పారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హిందీ ప్రవీణ, భూషణ్, విశారద సర్టిఫికెట్లు పనికిరావని అన్నారు.