తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే కారణంతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడిపెడుతూ పోస్టు పెట్టారని ఎంపీ తేజస్వీ, రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్ అహ్మద్‌ను విమర్శిస్తూ ఆయన పోస్టు పెట్టారు. కాగా, ప్రస్తుతం ఆ పోస్టును సూర్య డిలీట్ చేశారు.