TG: వరంగల్లో GWMC అధికారులు భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులను ప్రారంభించారు. పూడికతీత పనులను చేపట్టిన అధికారులు 15రోజుల పాటు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. 382 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భద్రకాళి చెరువుకు గండికొట్టి దాని నుంచి రోజుకు 500 క్యూసెక్కుల నీరు దిగువకు పంపనున్నట్లు వెల్లడించారు. దిగువన ఉన్న కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.