ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇటీవల ఉత్తర కొరియా సైన్యం కూడా చేరిన విషయం తెలిసిందే. రష్యా తరపున పోరాడేందుకు వేల సంఖ్యలో సైనికులు యుద్ధ రంగంలోకి వెళ్లారు. ఈ క్రమంలో సైనికులకు అపరిమిత ఇంటర్నెట్ సదుపాయాన్ని రష్యా కల్పించింది. దీంతో ఉత్తర కొరియా సైనికులు విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలు చూడటంలో నిమగ్నమయ్యారని ‘ది ఫైనాన్షియల్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. వారు పోర్న్‌కు బానిసలుగా మారడం రష్యాను కలవరపాటుకు గురిచేస్తుందని పేర్కొంది.