విశాఖపట్నం బీచ్ రోడ్లో ఛట్ పూజా సందడి కొనసాగుతోంది.నిన్న సాయంత్రం నుంచి ఉత్తరాదికి చెందినవేలాది మందిప్రజలు సముద్రతీరంలో సూర్యనారాయణ మూర్తికి పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం కూడా కొనసాగింది. వేలాది మంది ఉత్తరాదివారు తమకుటుంబ సభ్యులతో సహా విశాఖసాగర్ తీరానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో బీచ్ రోడ్లో పండుగ వాతావరణం నెలకొంది.