యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ముందుగానే పదవి నుంచి దిగిపోవాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించినా.. తాను రాజీనామా చేయబోనని వెల్లడించారు. అలాగే, ఫెడరల్ రిజర్వ్‌కు చెందిన ఏడుగురు గవర్నర్లను తొలగించడానికి కూడా చట్టప్రకారం అనుమతి లేదని తెలిపారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పలువురు అధికారులపై విరుచుకుపడ్డారు. పావెల్ డెమోక్రాట్లకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.