ASR: పాలనలో అర్థవంతమైన మార్పు కోసం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఫోరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఈమేరకు జిల్లాలో లాభాపేక్ష లేకుండా వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సోషల్ రెస్పాన్స్ కంపెనీలు ఈనెల 20వ తేదీలోగా ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.