దివంగత సీఎం జయలలిత కారు డ్రైవర్ కనకరాజ్ అనుమానస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో చినిపోయాడు. కనకరాజ్ మరణం తరువాత తన సోదరుడు ధనపాల్ పళనిస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఎస్టేట్లో జరిగిన చోరీతో పళనిస్వామికి సంబంధం ఉందని ఆరోపించారు. దీంతో పళని స్వామి పరువు నష్టం దావా వేశారు. ఎట్టకేలకు దానిపై హైకోర్టు తీర్పునిచ్చింది. ధనపాల్ నిరాధార ఆరపణలు చేశాడని అందుకు రూ.1.10 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.