AP: ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు అందింది. ఆయనపై రాష్ట్ర బిల్డింగ్, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సీఎంకు ఫిర్యాదు చేసింది. సత్యనారాయణపై గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని.. కావున వెంటనే విచారణ జరిపించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపులో సత్యనారాయణ తీరుపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు.