AP: సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల లాంతర్ పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ లాంతర్ ర్యాలీ చేపట్టారు. వైసీపీ హయాంలో రూ.35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.