కృష్ణా: ముసునూరు మండలం కొర్లగుంట గ్రామంలో గురువారం ఉపాధి హామీ కార్మికులకు సాంఘిక భద్రతపై అవగాహన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ (ఏపీ వీవీయూ) మండల కోఆర్డినేటర్ బుడుపుల జయశ్రీ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు, 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. ప్రతి కార్మికునికి జాబ్ కార్డు అందించి, భీమా సౌకర్యం కల్పించాలన్నారు.