భారత్-కెనడా మధ్య దౌత్య వైరం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆస్ట్రేలియాలో కేంద్రమంత్రి జైశంకర్ సమావేశాన్ని ప్రసారం చేసిన మీడియా సంస్థ ‘ఆస్ట్రేలియా టుడే’ను కెనడా నిషేదించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘ఆస్ట్రేలియా మీడియాపై కెనడా చర్యలు ఆశ్చర్యం కలిగించాయి. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆ దేశానికి ఉన్న కపట నీతిని ఇది ఎత్తిచూపుతోంది. వాస్తవాలను జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడింది’ అని భారత్ ప్రకటించింది.