VZM: స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో 2021లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణానికి చెందిన కుమిలి సురేష్‌కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,500 జరిమానా విధించారని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి వెళ్లి తరుచూ అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు.