మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ఇచ్చిన ఐదు హామీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వారి హామీలు అబద్ధం. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక.. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మూడు రాష్ట్రాల్లో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కేవలం హామీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసు’ అని అన్నారు.