China : కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు చైనా బంపరాఫర్
చైనా (China) ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జనాభా (population) విపరీతంగా పెరిగిపోతుండడంతో... ఇద్దరు పిల్లలు వద్దు ఒక్కరే ముద్దు నినాదాన్ని తీసుకువచ్చిన, చైనా ఇప్పుడా నినాదాన్ని తొలగించి, పెద్ద సంఖ్యలో పిల్లలను కనేందుకు గేట్లు ఎత్తివేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభ (population) కలిగిన చైనా దేశంలో 145 కోట్ల మంది జనాభా కలిగి ఉంది.
చైనా (China) ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జనాభా (population) విపరీతంగా పెరిగిపోతుండడంతో… ఇద్దరు పిల్లలు వద్దు ఒక్కరే ముద్దు నినాదాన్ని తీసుకువచ్చిన, చైనా ఇప్పుడా నినాదాన్ని తొలగించి, పెద్ద సంఖ్యలో పిల్లలను కనేందుకు గేట్లు ఎత్తివేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభ (population) కలిగిన చైనా దేశంలో 145 కోట్ల మంది జనాభా కలిగి ఉంది. అయితే చైనా ప్రభుత్వానికి ఈ జనాభా సరిపోవడం లేదట. జానాభా రేటు తగ్గతోందని చైనా ప్రభుత్వం (Goverment) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవ వనరులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చైనా భావిస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం పోత్సాహకం ఒక నెల రోజుల పాటు సెలవులు (Holidays)మంజురు చేస్తోంది. ఈ ప్రత్యేక సెలవులో వేతనం కూడా ఇస్తారు. దేశవ్యాప్తంగా జనాభా రేటు పెంపొందించుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. చైనాలో 1980 నుంచి 2015 వరకు అత్యంత కఠిన రీతిలో ఒక్కటే బిడ్డ విధానాన్ని అమలు చేశారు.
దాంతో జనన రేటు భారీగా పడిపోయింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగింది. అయితే ఇది చివరికి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే మార్పుగా పరిణమిస్తుందన్న నిపుణుల సూచనతో చైనా (China) అప్రమత్తమైంది. దాంతో పిల్లలను కనేందుకు యువతను ప్రోత్సహిస్తోంది.పెళ్లి అంటే ఏ యువకులైనా ఎగిరి గంతేస్తారు. కానీ పాపం చైనాలో యువకులు మాత్రం పెళ్లి చేసుకోవటానికి భయపడిపోతున్నారట. పెళ్లి పేరు ఎత్తితే చాలు ఏదో చేయకూడనిది అన్నట్లుగా భయపడుతున్నారట. దీంతో పెళ్లికాని ప్రసాదులు చైనాలో పెరిగిపోతున్నారు. ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం ఏది అంటే ఠక్కున చెప్పేస్తాం చైనా అని. కానీ చైనాలో అబ్బాయిలు పెళ్లిళ్లు (weddings) చేసుకోవటానికి ఇష్టపడకపోవటంతో ఆ ప్రభావం చైనా జనాభాపై పడనుంది. అదే జరుగుతోంది చైనాలో. గత కొంతకాలంగా అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవటానికి ఇష్టపడకపోవటంతో దేశంలో ఓ పక్క వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ‘చైనా ఇయర్ బుక్ 2021’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో గతేడాది పెళ్లిళ్లు (weddings) నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు.అధిక జనాభాను అరికట్టేందుకు దశాబ్దాలుగా చైనా చేపట్టిన చర్యలు ఆ దేశాన్ని వృద్ధ దేశంగా మార్చాయి.
దీంతో కాస్త ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన డ్రాగన్ ప్రభుత్వం 2016లో ఏకైక సంతానం నిబంధనలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల కూడా ఆశించిన ఫలితం లేకపోవడంతో 2021లో ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది. అయినా పెళ్లి (Marriage) అనే యువత భయపడిపోతోంది.దీనికితోడు అక్కడ స్త్రీలకంటే పురుషుల సంఖ్య ఏకంగా 3.49 కోట్లు ఎక్కువగా ఉంది. 20 ఏళ్లలోపు వయసున్న యువత సంఖ్య అయితే మహిళల కంటే 17.5 కోట్లు ఎక్కువని తేలింది. దీంతో యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. అంతేకాదు..అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. 43 శాతం మంది అమ్మాయిలు పెళ్లి అంటే ఇష్టపడట్లేదని ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. కాగా..చైనాలో 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి జనాభా ప్రస్తుతం 26.4కోట్లుగా ఉంది. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 18.7శాతంతో సమానం. తాజా జనాభా లెక్కల ప్రకారం.. 21 ఏళ్లుగా చైనాలో సగటు వార్షిక వృద్ధుల జనాభా పెరుగుదల రేటు దాదాపు 63 లక్షలుగా ఉంది. 2023 నుంచి ఈ సంఖ్య ఏడాదికి కోటి మంది చొప్పున మారనుందని చైనా డైలీ రిపోర్ట్ (Daily Report) అంచనా వేసింది. 2036 నాటికి చైనాలో వృద్ధుల జనాభా 29.1శాతానికి చేరుతుందని చెప్పింది.