TPT: క్రీడా మైదానాల ఆక్రమణలను తొలగించాలని ఏపీ జూడో సంఘం కోశాధికారి కిరణ్ కుమార్ శాప్ ఛైర్మన్ రవి నాయుడుని కోరారు. ఆయనను తిరుపతిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నూతన క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు.