GNTR: గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, రోగులకు మెరుగైన వైద్యం, అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశాలపై సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ, అధికారులతో చర్చించారు.