బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షూటింగ్లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ‘హంటర్’ అనే వెబ్ సరీస్‌లో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఫైట్ సీన్ చేస్తుండగా పక్కటెముకలకు ఒక చెక్క బలంగా తగిలినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు. తనకు తగింది చిన్న గాయమే అని, ప్రస్తుతం కోలుకున్నానని చెప్పారు. అతిత్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటానని, ఎవరూ ఆందోళన పడోద్దని కోరారు.