ys sharmila:పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో చెప్పు.. కేటీఆర్‌కు షర్మిల ప్రశ్న
ys sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల (ys sharmila) నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేటీఆర్, ఆ పార్టీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల (ys sharmila) ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర అని అడిగారు.
ys sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల (ys sharmila) నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేటీఆర్, ఆ పార్టీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల (ys sharmila) ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర అని అడిగారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసినందుకా? స్కీముల పేరిట స్కాములు చేసినందుకా? కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకుతిన్నందుకా? పాలమూరును కట్టకుండా దక్షిణ తెలంగాణను ఏడాది చేసినందుకా? 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని..4.80లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని షర్మిల దుయ్యబట్టారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని మోసం చేశారని (ys sharmila) ధ్వజమెత్తారు. వడ్డీ లేని రుణాలు, కార్పొరేషన్ లోన్లు ఇస్తామని దగా చేశారని విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. ఆ మాటే మరచిపోయారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేయలేదా అని దుయ్యబట్టారు. తర్వాత దళితబంధు పథకం తీసుకొచ్చారు.. దీంతో ఎవరికీ మేలు జరుగుతుందని అడిగారు. ఊరిలో ఒకరిద్దరికీ దళితబంధు వస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.
చదవండి:ktr fired on revanth:పదిసార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేశారు..రేవంత్: కేటీఆర్
డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు ఇస్తామని కుచ్చుటోపీ పెట్టారని షర్మిల (ys sharmila) మండిపడ్డారు. డిస్కం దివాళా తీసి, ఆర్టీసీని ఆగం జేసి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని విమర్శించారు. ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదు చిన్న దొర అంటూ ఫైరయ్యారు. మీ తాలిబన్ల పాలన చూసి, ఎనిమిదేండ్లుగా తెలంగాణ తల్లి తల్లడిల్లుతోందని గుర్తుచేశారు.
చదవండి:sajjanar:‘అందరికీ ఈమెలా అదృష్టం వరించదు!’ సజ్జనార్ సందేశం
దొరల పాలన విముక్తి కోసం తెలంగాణ సమాజం ఆశగా ఎదురుచూస్తోందని షర్మిల (ys sharmila) తెలిపారు. నియంత పాలనను ఫామ్ హౌజ్ కే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల (ys sharmila) పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసే సమయంలో వివాదం చెలరేగింది. శంకర్ నాయక్- షర్మిల (ys sharmila) ఇద్దరు కొజ్జా అని ఆరోపించుకున్నారు. ఇరు పార్టీల శ్రేణుల గొడవతో పాదయాత్రకు పోలీసులు బ్రేక్ ఇచ్చారు. ఆ వెంటనే మహిళా కమిషన్‌ను షర్మిల కలిశారు. తనకు జరిగిన అవమానాల గురించి డిస్కషన్ చేశారు. తమకు ఇక్కడ న్యాయం జరగకుంటే.. జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామని చెప్పారు.
4.80లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకా? రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసినందుకా? వడ్డీ లేని రుణాలు, కార్పొరేషన్ లోన్లు ఇస్తామని దగా చేసినందుకా? దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి అంటూ నిండా ముంచినందుకా? డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు ఇస్తామని కుచ్చుటోపీ పెట్టినందుకా? 2/4