AP: కడప కార్పొరేషన్ సర్వసభ్య భేటీ రసాభాసగా మారింది. ప్రొటోకాల్ పాటించలేదంటూ ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పక్కన సీటు తీసేయటంపై మండిపడ్డారు. ఈ విషయంలో కడప మేయర్‌ని మాధవి నిలదీశారు. సమావేశంలో ఎమ్మెల్యే మాధవి ప్రసంగాన్ని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళ అయినందునే తనని అవమానించారని ఎమ్మెల్యే మీడియాతో అన్నారు.