అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే మస్క్ సంపద 26.5 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.2లక్షల కోట్లు పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన మస్క్.. ట్రంప్ ప్రచారం నిమిత్తం భారీగా ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.