HYD: నగరానికి తాగునీరు, మూసీ పునరుద్ధరణకు మల్లన్నసాగర్ నుంచి నీటిని మళ్లించేందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో రూ.5,560 కోట్లతో టెండర్ నోటీసు విడుదల కానుంది. హిమాయత్‌సాగర్, గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ వద్ద నీటి శుద్ధీకరణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాగా.. జంట నగరాలకు 10 TMCలు, మూసీ ప్రక్షాళనకు మిగిలిన నీటిని ఉపయోగించనున్నారు.