మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసు హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. బాధితురాలు హైకోర్టుకు హాజరై.. నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని ప్రమాణపత్రం దాఖలుచేశారు. అయితే అలా చెప్పగానే కేసును కొట్టేయలేమని.. హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు.