ATP: గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం రైల్వే గేట్ వద్ద రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి గురువారం రైల్వే అధికారులతో కలిసి రైల్వే గేట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరలో నూతన రైల్వే బ్రిడ్జిను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.