TG: రైతు రుణమాఫీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల తాకట్టు పెట్టైనా డిసెంబర్‌లోపు మిగిలిన రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ అయ్యాక KTR తల ఏ టైర్ కింద పెడతాడో ఆలోచించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ నాయకులు, వారి తొత్తులు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని, అది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.