PLD: మందకృష్ణ మాదిగ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని మహాజన సోషలిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గడిపర్తి శ్రీనివాసరావు అన్నారు. గురువారం రెంటచింతలలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాదిగల ఉపకులాల ఆత్మగౌరవం హక్కులు అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు.