AP: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఐదేళ్లు వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేశారని, ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.