AP: రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.