E.G: రాజమండ్రి నగరంలోని మెయిన్ రోడ్డులో సోమవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ట్రాఫిక్, విద్యుత్ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.