ఈ నెలలో ఆకాశంలో 4 అద్భుతాలు కనువిందు చేయనున్నాయి. అందులో ఒకటి.. భూమి నుంచి నేరుగా చూడగల నక్షత్రాల్లో ఒకటైన స్పైకా ఈ నెల 27న గంటపాటు మాయం కానుంది. ఆరోజు చందమామ ఈ తెలుపు, నీలి కాంతుల తారకు తెరగా అడ్డువస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తూర్పు అమెరికా, కెనడాలో ఈ వండర్ విక్షించవచ్చు. ఇక మరో 3.. అంగారక, గురు, శని గ్రహాలు ఈ మాసంలో భూమికి చేరువగా రానుండగా.. రాత్రుళ్లు వీటిని నేరుగానే చూడవచ్చట.