HYD: హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ నివాసంలో బీసీ కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.