TG: రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ కులగణపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణనపై హైకోర్టు తీర్పుపై చర్చించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రేపటిలోగా ఈ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులగణపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు.