బీహార్ ఎంపీ పప్పు యాదవ్‌ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. దీంతో పప్పు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన మహేష్ పాండేగా గుర్తించారు. అతడికి ఏ గ్యాంగ్‌తో సంబంధాలు లేనట్లు సమాచారం. కాగా ఈ బెదిరింపులకు పాల్పడింది తానేనని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.