హర్యానాకు చెందిన ఓ వ్యక్తి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఫరియాబాద్‌కు చెందిన అతను దాదాపు 1000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి.. హృతిక్ ఇంటికి చేరుకున్నాడు. తన హీరోని కలవడానికి దాదాపు నాలుగు రోజులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాశాడు. ఈ విషయం తెలుసుకున్న హృతిక్.. ఆ వ్యక్తిని కలిసి కాసేపు మాట్లాడారు. అనంతరం అతనితో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.