HYD: డ్రగ్ టెస్ట్‌కు తాము శాంపిల్స్ ఇచ్చామని, దమ్ము, ధైర్యముంటే శాంపిల్స్ ఇవ్వాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో డ్రగ్స్ నిజ నిర్ధారణ కోసం యూరిన్, డీఓఏ డ్రగ్ ప్యానల్ శాంపిల్స్‌ను వారు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలని సవాల్ విసరారు.