తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా నియమితులైన బీఆర్ నాయుడిని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. అలాగే, టీటీడీ బోర్డు నూతన సభ్యులకూ అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను, ఔన్నత్యాన్ని మరింత పెంచేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కాగా, ఏపీ సర్కారు కొత్తగా టీటీడీ పాలకమండలిని ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులకు చోటుదక్కింది.