ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ఎనిమిదేళ్ల క్రితం మొదలు పెట్టిన దీపోత్సవం ఘనంగా జరిగింది. సరయూ నది తీరంలో నిర్వహించిన దీపోత్సవంలో 25 లక్షల దీపాలను వెలిగించారు. ఇది గిన్నిస్ రికార్డు. అయోధ్య నగరంలో రామమందిరానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నిర్వహిస్తున్న తొలి దీపావళి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీపాలతోపాటు లేజర్ షో నిర్వహించారు. అలాగే, రామాయణ నాటకం ప్రదర్శించారు.