TG: పీజీ మెడికల్ అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25కు గానూ కన్వీనర్ కోటా కింద MD, MS, డిప్లొమా కోర్సుల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. కాళోజీ వర్సిటీతోపాటు నిమ్స్ అనుబంధ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. రేపు ఉదయం 6 నుంచి నవంబర్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాన్ చేసిన సర్టిఫికేట్లను https://tspgmed.tsche.inలో అప్లోడ్ చేయాలి.