అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించిన దీపోత్సవ వేడుక రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. సరయూ నది తీరంలో అధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హారతి ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. యూపీ ప్రభుత్వం, టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 25,12,585 దీపాలను భక్తులు వెలిగించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నిస్ వరల్డ్ రికార్టును అయోధ్య దీపోత్సవం సాధించింది.