SKLM: కంచిలి నుంచి సోంపేటకి వచ్చే మార్గంలో హరీష్ కాంప్లెక్స్ వద్ద లారీ డ్రైనేజీలో దిగిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అసలే సోంపేట పట్టణం రోడ్డు విస్తరణ కాకపోవడం, వెడల్పు తక్కువగా ఉండడంతో వ్యాపారులు వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి మార్గాలలో భారీ లారీలు రావడానికి పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.