ప్రకాశం: మద్దిపాడు మండలం పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వచ్చే నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు మద్దిపాడు మండలం ఎంపీడీవో జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడవ తేదీన ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. కావున మండలంలోని ఎంపీటీసీ సభ్యులు సర్పంచులతో పాటుగా మండల స్థాయి అధికారులు హాజరుకావాలని కోరారు.