ప్రకాశం: పంగులూరు మండలంలోని ముప్పవరం గ్రామంలో ఈ నెలలో కురిసన వర్షాలకు మినుము నష్టపోయిన రైతుల జాబితాను ప్రదర్శించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. నవంబర్ రెండో తేదీ వరకు జాబితాను రైతు సేవ కేంద్రాల వద్ద ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రైతు సేవా కేంద్ర సిబ్బంది సంప్రదించాలన్నారు.