NLR: బుచ్చి పట్టణంలోని B.B జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తుమ్మల శ్రీనివాసన్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు శ్రీనివాసన్ మనవరాలను కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.