AP: తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ అధికారులు నేరుగా దర్శనానికి పంపుతున్నారు. నిన్న శ్రీవారిని 59,140 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 1,937 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.