WG: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.