కృష్ణా: విద్యుత్ లైన్ మరమ్మతుల నిమిత్తం నందిగామ మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లింగాలపాడు, అడవి రావులపాడు, తక్కెళ్లపాడు, పాత బెల్లంకొండ పాలెం, కొత్త బెల్లంకొండ పాలెం గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.