AP: జగన్ చీకటి పాలన రహస్యాలన్నీ త్వరలో ప్రజల ముందుంచుతామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పల్నాడు జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు. కుక్కపల్లివారిపాలెం, మైదవోలులో అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం అక్రమార్జన కోసం అర్ధరాత్రులు జీవోలు తెచ్చారని, అప్పట్లో గోప్యంగా ఉంచిన ఉత్తర్వులు జనం ముందు పెడతామని వెల్లడించారు.